25-07-2025 01:07:42 AM
కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యదర్శి విభూ నాయర్
నిర్మల్, జూలై ౨౪ (విజయక్రాంతి): పీఎం జన్మన్ (ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహాభియాన్) కార్యక్రమాన్ని వేగం గా పూర్తిచేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విభూ నాయ ర్ రాష్ట్ర కలెక్టర్లకు సూచించారు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గిరిజనుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ఆధార్ నమోదు, జన్ధన్ ఖాతాలు, పక్కా ఇళ్లు, పీఎం కిసాన్, కిసాన్ క్రెడిట్ కార్డులు వంటి పథకాలను విజయవంతంగా అమలు చేయాలని, కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షణ చేయాలన్నారు.
ఆది కర్మయోగి కార్యక్రమాన్ని క్రమబద్ధంగా అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యదర్శి జిల్లాల్లో చేపడుతున్న మౌలిక వసతుల నిర్మాణం, స్థల సేకరణపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, పీఎం జన్మన్ కింద చేపట్టాల్సిన అన్ని పనులు గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
అనుమతి లభించిన గ్రామాల్లో అర్హు ల గుర్తింపు కోసం పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహించాలని, సేకరించిన సమాచారం యాప్లో నమోదు చేయాలన్నా రు. జిల్లాలోని 24 హాబిటేషన్లలో 771 పక్కా గృహాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అంగన్వాడీలు, వసతి గృహాలు, ప్రైమరీ పాఠశాల లు, రోడ్డు కనెక్టివిటీ, మల్టీపర్పస్ సెంటర్లు నిర్మించేందుకు అవసర మైన చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించారు.
ఈ సమావే శంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, డిపిఒ శ్రీనివాస్, పీడీ హౌసింగ్ రాజేశ్వర్, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఎల్డీఎం రామ్గోపాల్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.