calender_icon.png 28 July, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ ఎస్పీని సన్మానించిన పీఆర్‌టీయూ నేతలు

28-06-2025 12:14:23 AM

మెదక్, జూన్ 27(విజయక్రాంతి): మెదక్ జిల్లాకు నూతనంగా వచ్చిన ఎస్పీ డి.వి.శ్రీనివాస్ రావును పీఆర్టీయు మెదక్ జిల్లా శాఖ శుక్రవారం కలిసి ఘనంగా సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం జిల్లాలో మెరుగైన ఫలితాలు వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఈగిల్ ప్రోగ్రాం కు ఉపాధ్యాయుల సహకారం ఉండాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు  సుంకరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి సామ్య నాయక్, సీనియర్ నాయకులు మ్యాడం వీరేందర్, సంగమేశ్వర్, కొంగటి శ్రీనివాస్, వెల్దుర్తి మండల అధ్యక్షులు శ్రీనివాస్,మెదక్ మండల అధ్యక్ష,  ప్రధాన కార్యదర్శులు సిరిగ చంద్రశేఖర్, ఇమ్మడి సంతోష్ కుమార్, మెదక్ పట్టణ కార్యదర్శి గంగారాం, పాపన్నపేట మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పంతులు రాజు, సురేష్, శంకరంపేట అధ్యక్షులు హరిబాబు పాల్గొన్నారు.