calender_icon.png 8 January, 2026 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఆర్టీయూ టీఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ

06-01-2026 12:13:24 AM

శ్రీరంగాపురం, జనవరి 5: పీఆర్టీయు టీఎస్ శ్రీరంగాపూర్ మండల శాఖ అధ్యక్షులు  వసంతపురం రాజు, ప్రధాన కార్యదర్శి నాయిని విష్ణువర్ధన్ నాయుడు ల ఆధ్వర్యంలో పీఆర్టీయు టీఎస్ దైనందిన కాలమానినిని శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో పిఆర్టియు టిఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు, అధికారులు మరియు యూనియన్ నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పిఆర్టియు టిఎస్ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ సంఘం ఏర్పడి 50 ఏళ్లకు పైన అవుతున్నా సంఘం ఏర్పడ్డ నాటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాడుతుందని పేర్కొన్నారు.  కార్యక్రమంలో శ్రీరంగాపూర్ మండల ఎంపీడీవో శ్రీ రవి నారాయణ, మండల విద్యాధికారి శ్రీ హనుమంతు, ప్రాథమిక సభ్యులు పెద్దమొత్తంలో పాల్గొన్నారు.