calender_icon.png 7 January, 2026 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా పెట్రోల్ అక్రమ విక్రయాలు

06-01-2026 12:13:41 AM

బ్లాక్ లో లీటరు రూ. 120 

గాలికి వదిలేసిన అగ్నిమాపక శాఖ నిబంధనలు

ప్రమాదకరంగా మారిన పెట్రోల్ నిల్వలు

సామాన్యులకు భారంగా మారిన పెట్రోల్ ధర 

చర్ల, జనవరి 5(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అక్రమ పెట్రోల్ విక్రయాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతున్నాయి. మూడు బంకులున్న పెట్రోల్ సైడ్ బిజినెస్ ప్లాస్టిక్ బాటిలలో పెట్రోల్ మోసం లీటర్ పెట్రోల్ కి లీటర్ బాటిల్ లో డబ్బా నొక్కి మరి తక్కువ పెట్రోల్ ఉండి ఎక్కువగా కనిపించేలా నింపుతూ వినియోగదారులను మోసం చేస్తున్నారు, కొందరు బ్లాక్ పెట్రోల్ మార్కెట్ వ్యాపారధారులు.. పెట్రోల్ లీటర్ ధర రూ108.82 పైసలు రూపాయల చిల్లర ఉండగా లూజ్ గా కొన్ని కిరాణా , బెల్ట్ షాపులలో సైతం  రూ120 నుంచి రూ130 ధరకి అమ్ముతున్నారని మండల ప్రజల ఆరోపిస్తున్నారు.

డీజిల్ ప్రాంతాలను బట్టి ధరరూ 97. 04 ఉండగా బ్లాక్ మార్కెట్లో మాత్రం వీటి ధర రూ.110  అమ్ముతున్నారు, సుమారు రూ 12 నుండి రూ 22  ఎక్కువ తీసుకుంటూ దండుకుంటున్నారు. వీధి వీధిన రోడ్లకు ఇరువైపులా  పెట్రోల్ డీజిల్ బాటిల్స్ కిరాణా షాపులలో కనిపిస్తుంటాయి,  అత్యవసరంలో కొందరు గత్యంతరం లేక అధిక డబ్బులు వెచ్చించి ఈ పెట్రోల్ డీజిల్ కొనే పరిస్థితి వచ్చింది,.

అసలు లూస్ పెట్రోల్ మార్కెట్ దందా ఎక్కడిది? 

చర్ల మండలంలో గతంలో ఒక బంకు మాత్రమే ఉండేది ఆ కారణంగా మండలంలో కొంత దూర ప్రాంతాల ప్రయాణికులు పల్లె ప్రాంతాలో పెట్రోల్ వినియోగదారుల అవసరార్థం అమ్ముతున్నారు అంటే ఒక అర్థం ఉండేది కానీ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా కిరాణా షాపులు, ఫ్యాన్సీ స్టోర్లలో విచిత్రం ఏమిటంటే బెల్ట్ షాపుల్లో సైతం వాటర్ బాటిళ్లలో పెట్రోల్ నింపి విక్రయిస్తున్నారని. ప్రభుత్వ ధర కంటే అధికంగా, లీటరుకు రూ. 120 వరకు వసూలు చేస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు అని ప్రజల ఆరోపిస్తున్నారు. పెట్రోల్ బంకులలో క్యాన్ ల ద్వారా బాటిల్ ద్వారా పెట్రోల్ కొట్టకూడదు అనే నిబంధనలో ఉన్నప్పటికీ పెట్రోల్ బంకులు బెకాతర్ చేస్తున్నాయి, దీంతో విచ్చలవిడిగా పెట్రోల్ విక్రయాలు జరుగుతున్నాయి.

ప్రమాదకరంగా నిల్వలు

అత్యంత దహనశీల పదార్థమైన పెట్రోల్ను ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా కిరాణా షాపుల్లో, నివాస ప్రాంతాల మధ్య నిల్వ చేయడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగినా భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని తెలిసి కూడా కొందరు వ్యాపారస్తులు ఈ దందా కొనసాగిస్తున్నారు, దీంతో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్ల మండలం లో 5  పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ అక్రమ పెట్రోల్ మాఫియా అడుగడుగునా కనిపిస్తోంది, ఒకప్పుడు మండల కేంద్రంలో ఒకటే పెట్రోల్ బంకు ఉండడంతో అందుబాటులో లేని ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు ఈ దందా కొనసాగేది కానీ ఇప్పుడు మండల కేంద్రంలో ఐదు బంకులు ఉన్నప్పటికీ లూస్ పెట్రోల్ అధిక ధరలతో అత్యధికంగా అమ్ముడు పోతుంది. 

అధిక ధరల దందా

బంకుల్లో లభించే ధర కంటే లీటరుకు 15 నుండి 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. అత్యవసర సమయంలో వాహనదారులకు వేరే దారి లేకపోవడంతో కిరాణా షాపులనే ఆశ్రయిస్తున్నారు. అయితే కొందరు పెట్రోల్ దందా వ్యాపారస్తులు లీటర్ వాటర్ బాటిల్ ను నొక్కి ఆ వాటర్ బాటిలోకి గాలి ప్రవేశించేలాగా చేసి అప్పుడు దాంట్లో పెట్రోల్ నింపుతున్నారు తద్వారా పెట్రోల్ బాటిల్ పూర్తిగా కనిపిస్తూ ఉంటుంది కానీ మూత తీయగానే పెట్రోల్ తగ్గినట్టుగా అర్థమవుతుంది హడావుడిలో వాహనదారుడు పెట్రోల్ పోసుకొని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నాడే తప్ప ఈ దందాని గుర్తించడం లేదు అని, దీనికి తోడు పెట్రోల్లో కల్తీ జరుగుతోందని ప్రజల నుండి ఆరోపణలు కూడా ఉన్నాయి, తద్వారా తమ వాహనాల ఇంజన్లు పాడవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు మండల ప్రజలు చెప్పకోస్తున్నారు

అధికారులు స్పందించాలి

నిబంధనలకు విరుద్ధంగా, లైసెన్స్ లేకుండా పెట్రోల్ విక్రయిస్తున్న వారిపై సంబంధిత పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టాలని, అక్రమ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.