calender_icon.png 17 September, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

17-09-2025 07:02:53 PM

మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏరియా లోని జీఎం కార్యాలయంలో బుధవారం సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని జిఎం ఎన్ రాధాకృష్ణ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం, సమస్యలకు పరిష్కారం, ప్రజా అవసరాలకు అనుగుణంగా పాలన సాగించ డమే ప్రజా పాలన అని అన్నారు. ప్రజా పాలన దినోత్సవం రాష్ట్ర ప్రజలకు  పండుగ లాంటిదని, ప్రజలకు జవాబుదారిగా ఉండి, పాలనలో భాగస్వామ్యం కల్పించడం,  ప్రజాస్వామ్యానికి ఉత్సవం జరుపుకునే రోజు అని ప్రజల సహకారంతో ప్రజా పాలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలనీ, ప్రజల సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించు కొని జిఎం కార్యాలయంలో పని చేస్తున్న అధికారులు తమ వద్ద ఉన్న ఫైల్స్ అన్నింటిని పూర్తి చేసి జీరో పెండెన్సీ విధంగా అడుగులు వేయాలని కోరారు.