calender_icon.png 18 September, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేటలో ప్రజాపాలన దినోత్సవం

18-09-2025 01:17:14 AM

మంత్రి పొన్నం ప్రభాకర్ 

సిద్దిపేట కలెక్టరేట్, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి):సిద్దిపేట కలెక్టరేట్ ఆవరణలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీ య పతాకావిష్కరణ చేశారు.

ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి పొన్నం ప్రభా కర్ మాట్లాడుతూ, ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం వల్ల పేద ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మానవీయ కోణంలో వెంటనే ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1779 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్స్కు చెల్లించిందని, రెండు రోజుల్లో రూ.100 కోట్లు విడుదల చేశామని, మిగిలిన బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు.ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన పలు పథకాలను గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని,

ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లు, రైతు రుణమాఫీకి రూ.23 వేల కోట్లు మంజూరు చేశామని తెలిపారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, భూ భారతి ద్వారా రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని వివరించారు.

తరువాత మంత్రి విశ్వకర్మ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వకర్మ మహర్షి శిల్పకళ, నిర్మాణ శాస్త్రం, యాంత్రిక విజ్ఞానానికి ఆది పితామహుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డా. అనురాధ, అదనపు కలెక్టర్ గరీమ అగ్రవాల్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.