18-09-2025 01:18:39 AM
ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో పలువురు రక్తదానం
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలం నుండి ర్యాలీగా ఎల్లారెడ్డి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పెద్ద ఎడ్ల నర్సింలు, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి, ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో భారతీయ జనతా పార్టీ చెందిన పలువురు నాయకులు రక్తదానం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఐడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించాలన్న దానిపై ప్రజలకు వివరించనున్నారు.
నీలం చిన్న రాజులు, రాష్ట్ర నాయకులు మురళీధర్ గౌడ్ బాణాల లక్ష్మారెడ్డి మర్రి బాలకిషన్ బాపురెడ్డి బత్తిని దేవేందర్ హైమా రెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ రవీందర్ రావు అసెంబ్లీ కన్వీనర్ లింగారావు పట్టణ అధ్యక్షులు అగల్ దివిటి రాజేష్ మండల అధ్యక్షులు పెద్దేడ్ల నర్సింలు మాజీ ఎంపీపీ నక్క గంగాధర్ మాజీ అధ్యక్షులు కుచులకంటి, సతీష్, ఎస్‌ఎన్, రెడ్డి సీనియర్ నాయకులు ప్యాలాల రాములు,శ్రీనివాస్ మహిళా మోర్చా అధ్యక్షురాలు సుజాత,హారిక,రజిత ప్రధాన కార్యదర్శులు కుచులకంటి,శంకర్, శ్రీను, పంతుల మహేందర్,జక్కుల అశోక్ ఉపాధ్యక్షులు వంగపల్లి కాశీనాథ్, అల్లం పండరి ,సాయిలు ,కార్యదర్శి బంజపల్లి శివ,మామిడి రమేష్, జనుముల, పోచయ్య కోశాధికారి గజానంద్ యువ నాయకులు హరికృష్ణ, జంగశివ వివిధ మండలాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
భీంగల్‌లో..
భీంగల్ సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): భీంగల్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని, భీంగల్ బాలికల పాఠశాలలో చెట్లు నాటి, విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యోగేశ్వర్ నరసయ్య, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు బండారి లక్ష్మణ్ గౌడ్, రైతు అధ్యక్షుడు నీలం గంగాధర్, బీజేవైఎం అధ్యక్షుడు రాగి అజయ్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పీరి గంగాధర్, సీనియర్ నాయకులు చిన్ని నరసయ్య, పతని ప్రవీణ్, దయ ప్రవీణ్, తోపారం సురేందర్, నామాల వెంకటేష్, ఈశ్వర, సాయి కాపు, కుమ్మరి హరీష్, శివ గంగాధర్, నీలం రమేష్, నరేందర్ గౌడ్, హరిప్రసాద్, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జ్లు పాల్గొన్నారు.
పెద్ద కొడప్గల్‌లో రక్తదాన శిబిరం..
పెద్ద కొడప్గల్ సెప్టెంబర్ 17 (విజయక్రాంతి) జుక్కల్ నియోజకవర్గ స్థాయిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించిన సందర్భంగా మొదట పాపహరేశ్వర ఆలయంలో నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా అర్చన చేయించడం జరిగింది. బిజెపి కార్యకర్తలు రక్తదానం చేశారు రక్తదానం చేసిన కార్యకర్తలకు పండ్లు వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది . నరేంద్ర మోడీ గారి పై ఉన్న ప్రేమ, అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. బిజెపి మాజీ శాసన సభ్యురాలు అరుణతార ,జిల్లా ప్రధాన కార్యదర్శి రాము , వివిధ మండలాల అధ్యక్షులు, పెద్దకొడప్గల్ మండల అధ్యక్షులు మల్లయల సుభాష్, పిట్లం మండల అధ్యక్షులు సాయి రెడ్డి, బిచ్కుంద మండ ల అధ్యక్షులు షెట్పల్లి విష్ణు, డోంగ్లీ మండల అధ్యక్షుడు ధనంజయ పటేల్ , మహమ్మద్ నగర్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ , జిల్లా కౌన్సిల్ మెంబర్ కృష్ణపంతులు , సంజయ్ పటేల్ ,మల్లికార్జున దేశాయ్, జాదవ్ పండరి, జిల్లా నాయకులు బూత్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది