27 May, 2026 | 2:59 AM

కొత్తగూడలో నేడు ప్రజాదర్బార్

27-05-2026 02:00 AM

హాజరు కానున్న మంత్రి సీతక్క 

మహబూబాబాద్, మే 26 (విజ యక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొ త్తగూడ మండల కేం ద్రంతో పాటు, ఓటాయిలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో బుధవా రం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు. కొత్తగూడ రైతు వేదికలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో కొత్తగూడ, చెరువు ముందు తండా, కొత్తపల్లి, గుంజేడు, వేలుబెల్లి గ్రామాల ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు దరఖాస్తులు చేయవచ్చని కోరారు.

అలాగే ఓటాయి గ్రామపంచాయతీ వద్ద నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఓటాయి, రెన్యా తండా, జంగవాని గూడెం, ఎంచ గూడ, కోణాపురం, సాదిరెడ్డి పల్లి గ్రామాల ప్రజలు తమ దరఖాస్తులను ఇవ్వాలని కోరారు..ఓటాయి గ్రామపంచాయతీలో ఉదయం 9 గంటలకు, కొత్తగూడ క్లస్టర్ లోని రైతు వేదిక నందు ఉదయం 11 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.