15-05-2025 12:00:00 AM
బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్
ముషీరాబాద్, మే 14 (విజయక్రాంతి) : వనపర్తి జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకై ఈనెల 28న వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ’జనభేరి’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జనభేరి బహిరంగ సభకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడా రు.
గత 15 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని, గత ప్రభుత్వంలో ఎన్నో అక్రమ కేసులు పెట్టినా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొని అనేక ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశామన్నారు. సభలో వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు జనభేరి సభలో ప్రస్తావిస్తామన్నారు.
సమగ్ర కుల గణన చేపట్టి, బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జనభేరి సభలో కృతజ్ఞతలు తెలుపుతామన్నారు. జనభేరి సభలో ప్రముఖ జానపద కళాకారులు జంగిరెడ్డి, జానులిరి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహి స్తున్నట్లు తెలిపారు.
కావున పార్టీలు, మతా లు, కులాలకతీతంగా ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా హాజరై బహిరంగ సభను విజయ వంతం చేయాలని కోరారు. జెఎసి నేతలు బడేసాబ్, పాండురంగ యాదవ్, చింతపల్లి సతీష్ గౌడ్, గోటూరి రవీందర్, గూడుషా, దేవర శివ, అంజన్న యాదవ్, ధర్మేంద్ర సాగర్, అస్కని రమేష్, రేనట్ల మల్లేష్, ముత్యాల వినోద్ సాగర్, చెలిమిల్ల రామన్ గౌడ్, నరసింహ యాదవ్, మట్టపల్లి అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.