14-05-2025 10:31:44 PM
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) లో అమరుడైన వీర జావాన్ మురళీ నాయక్ కు బుధవారం నల్లగొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫా సెన్స్ పాఠశాలలో జరుగుతున్న ఉపాద్యాయ శిక్షణ కేంద్రంలో ఉపాద్యాయులు సంఘాలకు అతీతంగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిసిటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నే శంకర్ గౌడ్, కోర్స్ డైరెక్టర్స్, ఎంఈఓ లు నాగయ్య అరుంధతి, వెంకట్ రమణ, లచ్చిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.