15-05-2025 12:00:00 AM
పోస్టర్ ఆవిష్కరించిన బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏ.వినయ్ కుమార్
ముషీరాబాద్, మే 14 (విజయ క్రాంతి) : గాంధీనగర్ డివిజన్‌లో ఈ నెల 16, 17 తేదీలలో డివిజన్‌లోని కేవలం 14 ఏళ్ల లోపు వయసుగల పిల్లలకు అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్-2025 నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ బుధవారం బీజేపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో వారి ’నీవీ చారిటబుల్ ట్రస్ట్’ సౌజన్యంతో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను వేసవి సెలవుల్లో వున్న పిల్లలకు క్రీడల్లో ఆసక్తిని కలిగించడంతో పాటు గెలిచిన టీంలకు ప్రముఖుల చేతులమీదుగా నగదు బహుమతి, ట్రోఫీ లతో పాటు సర్టిఫికెట్లను అందచేయనున్నమని వివరిం చారు.
శుక్ర, శని వారాల్లో రెండు రోజులు స్థానిక శ్రీనివాసా గ్రౌండ్స్ లో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. ఆసక్తిగల పిల్లలు తమ ఆధార్ కార్డు జీరాక్స్‌తో నిర్వాహకులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వి.నవీన్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, పి.న ర్సింగ్ రావు, సత్తి రెడ్డి, శివ కుమార్, సాయి కుమార్, ఆనంద్ రావు, సత్యేందర్, రాహుల్, సాయి తేజ, నీరజ్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.