calender_icon.png 6 September, 2025 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వీడి రోడ్డును పునఃనిర్మించాలి

05-09-2025 01:07:42 AM

సీపీఐఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

నూతనకల్, సెప్టెంబరు  4 :మండల కేంద్రం నుండి వెంకేపల్లి వరకు పూర్తిగా గుంతల మయమైన రోడ్డును వెంటనే  పునః నిర్మించాలి కోరుతూ సిపిఐ ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి పాదయాత్రలో పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గురువారం సిపిఐఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  మండల పరిధిలోని చిల్ప కుంట్ల నుండి మండల కేంద్రానికి చేరుకున్న పాదయాత్ర అనంతరం నిర్వహించిన రాస్తారోకోలో  మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వీడి వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్డు పునర్నిర్మాణ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.

ఎంఎల్‌ఏ మందుల సామెల్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ఈ రెండు గ్రామాలకు వెంటనే నిధులు కేటాయించి పనులు చేయించాలన్నారు.  స్థానిక ఎస్త్స్ర నాగరాజు, పంచాయతీరాజ్ ఇంజనీర్ కళ్యాణ్ రాస్తారోకో స్థలానికి చేరుకొని మాట్లాడుతూ  సంబంధిత అధికారులకు  నివేదిక పంపామని  నిధులు మంజూరైన వెంటనే రోడ్డు పనులు చేపడుతామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమింప చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం, మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి,మండల కమిటీ సభ్యులు బొజ  శ్రీను,బత్తుల  జనార్ధన్ గౌడ్, చూడి మధుసూదన్ రెడ్డి ,బత్తుల తిరుమల్ ,సామ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.