3 July, 2026 | 10:42 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

పార్టీలకతీతంగా ప్రజా సేవ చేయాలి

02-06-2025 12:36 AM

నిరుపేదలకు అన్నదానం నిర్వహించిన శ్రీకాంత్

చేగుంట, జూన్ 1 :  పార్టీలకు అతీతంగా ప్రజా సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని చేగుంట మండల కాంగ్రెస్ యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్ తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తూప్రాన్ ప్రభుత్వాసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి నిరుపేదలకు తానే స్వయంగా అన్నదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తుందన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు, రూ.500 సిలిండర్, రూ.200 యూనిట్ల ఉచిత కరెంట్తో పాటు మహిళా సంఘాలను ప్రోత్సహించేలా అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.