3 July, 2026 | 11:34 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

గ్రామదేవతలే ప్రజల రక్షకులు

02-06-2025 12:34 AM

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

సిద్దిపేట, జూన్ 1 (విజయక్రాంతి): ప్రతి ఏటా గ్రామదేవతలను పూజించడం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గ్రామదేవతలే ప్రజలకు రక్షకులుగా ఉంటారని, పాడి, పంటలు సమృద్ధిగా సాగుతాయని చెప్పారు.  సిద్దిపేట జిల్లా లింగారెడ్డి పల్లి గ్రామంలో జరుగుతున్న గ్రామ దేవత ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

కార్యకర్తలతో కలిసి పార్టీ సీనియర్ నాయకులు మెరుగు రాజు ఇంట్లో భోజనం చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లింగరెడ్డిపల్లికి రావడంతో సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి ఆత్మీయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ, బొమ్మల యాదగిరి, మెరుగు రాజు, ముత్యం తదితరులు పాల్గొన్నారు.