calender_icon.png 5 September, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధి నిర్వహణలో సమయపాలన పాటించాలి

04-09-2025 01:37:56 AM

డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓ క్రాంతికుమార్ 

వెంకటాపురం నూగూరు,  సెప్టెం బర్ 3 (విజయ క్రాంతి):  వైద్య సిబ్బంది విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలని ఎటునాగారం ఐటిడిఏ పరిధి డిప్యూటీ డిఎం హెచ్వో క్రాంతి కుమార్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని మరికల రంగరాజపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు గ్రామాలలో ఇంటింటి సర్వే 20 తప్పనిసరిగా సర్వే చేయాలని తెలిపారు.

జ్వరం వచ్చిన వ్యక్తుల రక్తపూత సేకరించి వారిని వైద్యశాలకు పంపించాలని, గ్రామాలలో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మురికిగుంటలో తిమోపాస్మను చల్లాలని, దోమలు పుట్టకుండా, కొట్టకుండా చూడాలని  పేర్కొన్నారు. కాచి చల్లార్చిన నీరు తాగాలని, వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ఐ టి డి ఏ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ కోరం కాంతి కుమార్, హెచ్ ఇ ఓ. కోటిరెడ్డి, ఏఎన్‌ఎం. ఆదిలక్ష్మి, సూర్య కుమారి, రోజా రాణి, సుశీల, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.