calender_icon.png 1 January, 2026 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వానాకాలం సీజన్‌లో 3,27,579 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

31-12-2025 01:50:37 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : ఈ వానాకాలం సీజన్ లో జిల్లాలో 62,887 మంది రైతుల నుండి 3,27,579.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్  నంద్‌లాల్ పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025- 26 వానాకాలం సీజన్‌లో ధాన్యం సేకరణకు జిల్లా వ్యాప్తంగా ఐకెపి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మెప్మా, ఏఫ్ పీఓల ఆధ్వర్యంలో 348  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

అయితే జిల్లా వ్యాప్తంగా 62,887 మంది రైతుల నుండి 2 లక్షల 27,320.560 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, 1,00258.720 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం మొత్తం 3,27,579.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇందుకుగాను రైతులకు రూ.782.59 కోట్లు చెల్లించడం జరిగిందని, అలాగే బోనస్ కింద మరో రూ.113.65 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసినందుకు సంబంధిత శాఖల అధికారులు, ఎస్ హెచ్ జి, మెప్మా , పి ఏ సి ఎస్ సిబ్బందిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.