31-12-2025 01:50:27 AM
ఎంపీ ఈటల రాజేందర్, డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ ప్రత్యేక పూజలు
ఘట్‌కేసర్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మేడ్చల్ నియోజకవర్గం ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని పలు దేవాలయాలలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ని వైభవంగా నిర్వహించారు. ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. యoనంపేట్ లోని శ్రీరంగనాథస్వామి దేవాలయం, వెంకటపురంలోని శ్రీ బాలాజీ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పూజల సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు వారు తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ నర్రి మంజుల శ్రీశైలం, ధర్మకర్తలు, ఈవో ఎల్. భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, నాయకులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కర్రే రాజేష్ , సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, మెట్టు గణేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, బర్ల అనీత, గొంగళ్ల బాలేష్, గొంగళ్ళ మహేష్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తిన భక్తులు
మొయినాబాద్, డిసెంబర్ 30 (విజయ క్రాంతి): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మొయినాబాద్ ప్రాంత ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకోని మంగళవారం మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కనకమామిడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఉత్తర ద్వారా దర్శనం చేయించారు.
ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఏస్.రత్నం, గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్, గ్రామ సర్పంచ్ శ్రీదివ్య మురళీధర్ రెడ్డి, ఉపసర్పంచ్ లావణ్య హరి,వార్డు సభ్యులు ఆలూరు మహేష్ యాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు మాదాపురం శ్రీకాంత్, మున్సిపల్ అధ్యక్షుడు దారెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.