12-11-2025 04:56:59 PM
నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): వరి ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించేందుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ భీమ్ రెడ్డి అన్నారు. బుధవారం దిల్వార్పూర్ నర్సాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రతి రైతు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లర్లకు పంపాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు నాయకులు పాల్గొన్నారు.