15 April, 2026 | 9:31 AM

శ్రీనాథుని విగ్రహం పెట్టండి!

15-06-2025 12:00 AM

తెలుగు ప్రాచీన కవులలో శ్రీనాథుడు గొప్ప కావ్యాలు, పురాణాలు, ప్రబంధాలు రాశారు. శైవ వాఙ్మయం విషయానికి వస్తే పురాణాంతర్గత విషయాలను స్వతంత్రమైన కావ్యమార్గంలో రచన చేయటంలో శ్రీనాథుడు దిట్ట. శ్రీనాథుని రచనలు ధ్వని గాంభీర్యం కలిగి ఉంటాయి. హైదరాబాద్ నగరంలో ఈ ప్రాచీన మహాకవి విగ్రహం లేకపోవటం ఎంతో లోటుగా ఉంది.

ట్యాంక్‌బండ్‌పై ప్రాచీన, ఆధునిక కవుల విగ్రహాలు ఉన్నా అందులో శ్రీనాథుని విగ్ర హం లేకపోవటం భాషా ప్రేమికులను నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటికైనారాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై శ్రీనాథుని విగ్రహాన్ని నెల కొల్పి తెలుగు భాషా సాంస్కృతిక వారసత్వాన్ని చాటాలి. 

 కప్పగంతు వెంకట రమణమూర్తి, 

సుచిత్రా కూడలి, సికింద్రాబాద్