7 July, 2026 | 6:24 PM

Breaking News

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •  

ప్రిక్వార్టర్స్‌లో పీవీ సింధు

16-10-2024 12:31 AM

లక్ష్యసేన్, మాళవిక ఓటమి

డెన్మార్క్ ఓపెన్

ఒడెన్సే: డెన్మార్క్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధూ 21-8, 13-7 తేడాతో తైవాన్‌కు చెందిన పై యూ పోను ఓడించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. తొలి గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన సింధూ రెండో గేమ్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే పై రిటైర్డ్‌గా వెనుదిరగడంతో సింధూ విజయం సాధించినట్లయింది.

ప్రిక్వార్టర్స్‌లో సింధూ చైనా షట్లర్ హన్ యూతో తలపడే అవకాశముంది. ఇక పురుషుల విభాగంలో భారత టాప్ సీడ్ లక్ష్యసేన్‌తో పాటు మహిళల విభాగంలో మాళవిక బన్సోద్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. మంగళవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో లక్ష్యసేన్ 21-12, 19-21, 14-21తో గువాంగ్ జు (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు.

చైనా ఓపెన్‌లో క్వార్టర్స్ చేరిన మాళవిక బన్సోద్ 13-21, 12-21 తేడాతో గుయెన్ (వియత్నాం) వరుస గేముల్లో ఓడి ఇంటి దారి పట్టింది. మహిళల డబుల్స్‌లో రుతుపర్ణ-శ్వేత పర్ణ జోడీ 18-21, 22-24 తేడాతో చైనీస్ తైపీ ద్వయం మీద ఓడిపోయి నిరాశపర్చింది.