6 August, 2026 | 7:26 PM

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

06-08-2026 06:23 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ యూత్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ఆవిర్భావం కోసం ఆయన జీవితాంతం చేసిన కృషి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.