శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి నిత్య కళ్యాణం గరుడ సేవ పూజలు
06-08-2026 06:26 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, మట్టపల్లి మహాక్షేత్రం నందు గురువారం శ్రీ స్వామి వారికి ప్రాతఃకాలమున నిత్యాభిషేకములు, నిత్య హోమములు జరిగాయి. తదుపరి నిత్య కళ్యాణం,గరుడ సేవ దేవాలయ అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయ చార్యులు వారిచే శాస్త్రోతముగా నిర్వహించబడినది. దేవాలయం అన్నదానంలో 110మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది.






