కోనరావుపేటలో బీజేపీ 'హర్ ఘర్ తిరంగా' సన్నాహక సమావేశం
- పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమ సన్నాహక సమావేశం, మండల కార్యవర్గ సమావేశం మండల శాఖ అధ్యక్షులు మిర్యాల్‌కార్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ ఓబీసీ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేగుల సంతోష్ బాబు మాట్లాడుతూ... దేశ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా పార్టీ పిలుపు మేరకు మండలంలోని ప్రతి గ్రామంలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఇంటిపై, వ్యాపార సంస్థలపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు. ఇంటింటికీ జాతీయ జెండాలు చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.అనంతరం జరిగిన మండల కార్యవర్గ సమావేశంలో మండల అధ్యక్షులు మిర్యాల్‌కార్ బాలాజీ మాట్లాడుతూ... పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీజేపీ డిస్ట్రిక్ కౌన్సిల్ సభ్యుడు గొట్టే రామచంద్రం, మండల ప్రధాన కార్యదర్శి బైరగోని సురేష్ గౌడ్, ఎక్కాల దేవి జలేందర్, ఉపాధ్యక్షులు చింతల పరుశురాం, ఎడ్ల సుధాకర్, చీకటి మధు, మహిళా మోర్చా అధ్యక్షురాలు తీగల జయశ్రీ, శివంగలపల్లి ఉప సర్పంచ్ లావణ్య రామ్‌రెడ్డి, జింక వెంకట్, మొతుకు మోహన్, తిరుపతి, దుండుగల బాలరాజు, చల్ల జితేందర్ రెడ్డి, బోయిన నర్సయ్య, పొన్నం మహేష్, తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






