జావలిన్ త్రో రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి వెన్నెల
06-08-2026 06:09 PM
కోహెడ,(విజయక్రాంతి): కోహెడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి జాలిగం వెన్నెల అండర్-14 విభాగం జావలిన్ త్రో క్రీడా లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఏం మహమూద్ తెలిపారు. ఇటీవల సిద్దిపేట లో జరిగిన జిల్లా స్థాయి పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు చెప్పారు. శుక్రవారం హనుమకొండలో జరుగనున్న.. రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.






