6 August, 2026 | 7:28 PM

తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా

06-08-2026 06:21 PM

ఎర్రబోయినపల్లిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు మండల పరిధిలోని ఎర్రబోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చండ్రుపట్ల సెక్టార్ సూపర్వైజర్ సుజాత మాట్లాడుతూ తల్లిపాలు సృష్టిలో అత్యంత విలువైనవని,బిడ్డకు మొదటి టీకా తల్లిపాలేనని తెలిపారు. ప్రతి తల్లి శిశువుకు తల్లిపాలే తప్పనిసరిగా  ఇవ్వాలని, సమాజంలో అందరూ తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలుసుకొని ప్రోత్సహించాలని సూచించారు.తల్లులకు అవగాహన కల్పిస్తూ, శిశు పోషణపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ ఏఎన్ఎంలు పద్మ, ఉమా, అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, యశోద, సుమలత, ఆదిలక్ష్మి, ఆశా కార్యకర్తలు తిరుమల, మణి, సువార్త, వార్డు సభ్యులు, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.