తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం జీవితాన్ని త్యాగం
అమరజీవి ఆచార్య డాక్టర్ జయశంకర్ సార్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రదాత ఆచార్య డాక్టర్ జయశంకర్ సార్ జయంతి వేడుకల సందర్భంగా మేడ్చల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రామన్నగారి రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆచార్య డాక్టర్ జయశంకర్ సార్ చేసిన కృషి ఎన్నటికీ మరువలేమని ఆయన కొనియాడారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆచార్య డాక్టర్ జయశంకర్ సార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఆయన ఘనంగా నివాళులు అర్పించినట్లు వెల్లడించారు.
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అప్పటి ఉద్యమ కాలంలో ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఆచార్య డాక్టర్ జయశంకర్ సార్ కే దక్కిందని రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాంతం అహర్నిషలు శ్రమించిన ఆచార్య డాక్టర్ జయశంకర్ సార్ ను విద్యార్థిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి గౌడ్.వైస్ ప్రిన్సిపాల్ మమత.సొసైటీ డైరెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి.మున్సిపల్ మాజి కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ.ఫౌండేషన్ సభ్యులు కటిక వినయ్ కుమార్.అధ్యాపక బృందం.కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు.విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






