తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ
హుస్నాబాద్‌లో అవగాహన
హుస్నాబాద్: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 18వ వార్డులో తల్లిపాల ప్రాముఖ్యతపై గురువారం అవగాహన కల్పించారు. వార్డు కౌన్సిలర్ వాల సుప్రజ నవీన్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.తల్లిపాలే శిశువుకు సంపూర్ణ పోషకాహారమని, పుట్టిన తర్వాత తొలి ఆరు నెలల పాటు ప్రతి తల్లి తప్పనిసరిగా తల్లిపాలే ఇవ్వాలన్నారు. తల్లిపాలు శిశువుకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడతాయని వివరించారు.
ఆరోగ్యలక్ష్మి పథకం సేవలు, గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ సావుల రేణుక, ఆశా కార్యకర్తలు ఆశ, సంపూర్ణ, గర్భిణులు, బాలింతలు, తల్లులు, చిన్నారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఇందులో భాగంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






