ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే
రామాయంపేట,(విజయక్రాంతి): తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహం రామాయంపేటలో ఘనంగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయశంకర్ ఆశయాలు యువతకు స్ఫూర్తిగా నిలవాలని నాయకులు పిలుపునిచ్చారు. సిద్దిపేట చౌరస్తాలో వివేకానంద విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి, భూమి పూజలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రావ్ స్థానిక అయ్యప్ప కర్రీ పాయింట్‌లో కార్మికులతో కలిసి మక్క రొట్టె తింటూ ఆప్యాయంగా ముచ్చటించారు. ప్రజలతో మమేకమైన ఈ దృశ్యం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం నాయకులు మెదక్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మెట్టు గంగారం తో పాటు పలువురు కౌన్సిలర్లు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.






