calender_icon.png 16 December, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్తారంలో కొండచిలువ హతం

15-12-2025 10:27:27 PM

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండల కేంద్రంలోని తొమ్మిదో వార్డులో సోమవారం రాత్రి కొండచిలువ హల్చల్ చేసింది. గాజుల గాజనవేన రమేష్ ఇంటి సమీపంలోకి కొండచిలువ ప్రవేశించడంతో కొండచిలువను ఇంట్లో ఉన్నవారు చూసి హడలెత్తిపోయారు. కొండచిలువ ఉందని చుట్టుపక్కల వారు వచ్చి హతమార్చారు. అడవిలో ఉండాల్సిన పెద్ద కొండచిలువ ప్రజలు నివసిస్తున్న ఇండ్లలోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.