15-12-2025 10:33:37 PM
కేసముద్రం (విజయక్రాంతి): కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న 85 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వెట్టర్లు, రేడియం జాకెట్లు పంపిణీ చేశారు. చలి నుండి రక్షించడానికి, ప్రమాదాల నుండి నివారించడానికి స్వెటర్లు, జాకెట్లు అందజేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం పట్ల దాతృత్వం చూపించిన వేం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ వేం కృష్ణ భార్గవ్ రెడ్డికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అల్లం నాగేశ్వరరావు, రావుల మురళి, అంబటి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.