27-10-2025 10:39:13 PM
కొండచిలువను కొరికి చంపిన కోతులు..
ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలో సోమవారం ఓ ఇంట్లోకి కొండచిలువ ప్రవేశించింది. దాదాపు 7 అడుగులు ఉన్న ఈ కొండచిలువ కోతిని నోట కరుచుకొని మింగుతుండగా చూసిన మిగతా కోతుల మంద వింత శబ్దాలతో అరుస్తూ కొండచిలువపై దాడి చేసి సహచర కోతిని విడిపించేందుకు శతవిధాల ప్రయత్నం చేశాయి. అయినా కొండచిలువ మాత్రం కోతిని పూర్తిగా మింగేసింది. ఆ తర్వాత కోతుల గుంపు మొత్తం అ కొండచిలువను దాడి చేసి కొరికి చంపేశాయి.