క్యూటీఎఫ్‌ఎస్‌ఎఫ్‌వారి నూతన కార్యాలయం
మాదాపూర్‌లో ఘనంగా ప్రారంభం
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): మాదాపూర్, సిద్ధివినాయక్ నగర్‌లో క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్ (క్యూటీఎఫ్‌ఎస్‌ఎఫ్)కార్యాలయాన్ని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రారంభించారు. క్వాలిటీ థాట్ గ్రూప్ చైర్మన్ రమణ భూపతి, సీఈఓ క్రిష్ చింతలూరి ఆధ్వర్యంలో కార్యక్ర మం జరిగింది.
సైయంట్ సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్ గ్లోబల్ పీపుల్ ఆపరేషన్స్ అరవింద్ మాథుర్, అలీప్ జనరల్ సెక్రటరీ కవిత రాజేష్, మెడికవర్ హాస్పిటల్స్ డీజీఎం కార్పొరేట్ రిలేషన్స్ శైలజ కోట, అజస్ర హోమ్స్ సీ ఈఓ అనిత చపరాల, క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్ చీఫ్ బ్రాండింగ్ ఆఫీసర్ డా. పావని కడియాల్ పాల్గొన్నారు. ఆగస్టు 8న నిర్వహించనున్న ‘ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఫౌండేషన్ సీఈఓ తెలిపారు.






