6 August, 2026 | 2:30 AM

రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి

06-08-2026 12:00 AM
  1. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
  2. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్, ఆగస్టు 5 (విజయ క్రాంతి): రాష్ట్రాన్ని అమ్మవారు సుభిక్షంగా ఉంచాలని టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టి ఎన్జీవోస్ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్లో  నిర్వహించిన బోనాల పండుగకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా ప్రతి ఆషాడమాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సుఖశాంతులు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను టీఎన్జీవోస్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త, నుడాచైర్మన్ కేశ వేణు, కార్పొరేషన్ చైర్పర్సన్ ఉమారాణి, శేఖర్ గౌడ్ రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ దయాకర్ గౌడ్ టీఎన్జీవోస్ అధ్యక్షులు సుమన్ కుమార్, కార్యదర్శి శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతి నిధులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.