ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలోని నాణ్యమైన విద్య అందుతుందని మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు(Mandal Education Officer Venkateshwarlu) అన్నారు. గురువారం నిర్మల్ మండలంలోని అక్కాపూర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి బడి పండుగలు పాల్గొన్నారు. విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు పూల వర్షం కురిపిస్తూ రంగురంగుల గాలి బుడగలతో మామిడి తోరణాలతో స్వాగతం పలికారు. పాఠశాల వాతావరణం పండగల తలపిస్తుందని గ్రామస్తులు పోషకులు తెలిపారు.అక్కాపూర్ గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ ,ఈజీఎస్ ప్రభాకర్ & ప్రధానోపాధ్యాయులు సుదర్శన్ ఉపాధ్యాయులు మొక్కలు నాటారు మరియు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటి పుస్తకాలు మరియు యూనిఫామ్ పంపిణీ చేశారు.






