calender_icon.png 23 July, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి

23-07-2025 12:07:24 AM

  1. కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి

సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి

 నెలవారీ సమీక్షలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, జూలై 22(విజయక్రాంతి): ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి సత్వర న్యాయం అందేలా చూడాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. మంగళవారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించి ఆయన మాట్లాడారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా ఉండాలని, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్లో ఉండాలన్నారు. అత్యాచార, పొక్సో కేసులలో దర్యాప్తును వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులో దోషులను న్యాయస్థానం ముందు ఉంచాలని అన్నారు. సుదీర్ఘ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ఎఫ్.ఎస్.ఎల్ పెండింగ్ రిపోరట్స్ పొంది, కేసులను ఫైనల్ చేయాలని అన్నారు. 

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై అవగాహన కల్పించాలి...

ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, డ్రగ్ దుర్వినియోగం, ట్రాఫిక్ రూల్స్ పై జిల్లా ప్రజలలో, విద్యాసంస్థలలో కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్హెచ్వోలకు సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆన్లైన్ లో వీడియో కాల్స్ చేసి, పోలీసు అధికారులంటే నమ్మరాదని, ఏ పోలీసు అధికారులు వీడియో కాల్స్ చేయరని గుర్తించాలని అన్నారు.

డిజిటల్ అరెస్ట్ లు ఉండవు, ఫిజికల్ అరెస్ట్ మాత్రమే ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు గా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేయించాలని సూచించారు. సీసీ కెమెరాలను అన్ని దేవాలయాలు, రోడ్లపై, వీధుల్లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో జిల్లాలోని డీఎస్పీలు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ కిరణ్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ వేణు గోపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రవి, సీఐలు, ఎస్.ఐలు పాల్గొన్నారు.