23-07-2025 12:12:36 AM
ఊరు వెలిసిన నాటి నుంచి కాలినడకే
ఓట్ల కోసమే ప్రజలను వాడుకుంటున్న నేతలు
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
హామీలకే నేతలు పరిమితం
గోపాలపేట జూలై 22: తాతయ్య ఎందు కు మన ఊరులో బస్సు కనిపించదు చుట్టుపక్కల అడవుల్లో ఉన్న తండాలకు బస్సు పో తది మనకెందుకు రాదు. ముఖ్యమంత్రి ఎం తోమంది ఆధార్ కార్డుతో బస్సు ప్రయాణం చేస్తున్నారు మరి చెన్నూరు విద్యార్థులను ఆ ధార్ కార్డుతో బస్సు ఎక్కి ప్రయాణం చే యించరా...ఏ మరో మనవడా మనం చేసుకున్న కర్మ అలాంటిది ఎలా చెప్పాలి మన ఊరికి బస్సు రావాలంటే మూడు బాటలు ఉన్నాయి రా...
ఎంతోమంది పెద్దోళ్ళు వచ్చి పోతుంటారు కానీ మన గ్రామం గురించి ఎవరికీ పట్టదు ఏం చేద్దాం..... చెన్నూరు గ్రా మం వెలసిన నాటినుండి నేటి వరకు కూడా ఎర్ర బస్సు ఎరగని ప్రజలు చెన్నూరు గ్రా మానికి మూడు బీటీ రోడ్డు రహదారులు ఉన్న పాపం ఆ ప్రజలు మాత్రం తమ అవసరాలకు తమ గ్రామంలో నుండి ఏనాడు బస్సు ఎక్కని దరిద్రం నెలకొంది.
ఈ గ్రా మం తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తూర్పుకు పడమర దిక్కున వెలిసిన చెన్నూరు గ్రామం. ఈ గ్రా మంలో 50గడపలు జనాభా వేల 600 పైసలుకు ఉంది. ఈ గ్రామం వెలసిన నాడు పటేల్ పట్వారిలు పాలించేవారు. పటేల్ పా లన పూర్తి అయ్యాక ప్రభుత్వాల్లో చాయి. సర్పంచులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీ లు ఎంతోమంది మారుతూ వస్తున్నారే త ప్ప ఈ చెన్నూరు గ్రామం మాత్రం మారలే దు.
ప్రజలను పాలించే ప్రజా నేతలు మా త్రం చెన్నూరు గ్రామ ప్రజల ఓట్ల కోసమే ఉన్నానని తప్ప తమ గ్రామాన్ని అభివృద్ధి పరచకపోవడం శోచనీయం. అంటే ముఖ్యం గా ప్రజలకు కావలసిన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ గ్రామం ఎంతో అభివృద్ధిలోకి వచ్చేది. ఈ గ్రామం మాత్రం ఎక్క డ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా మా రింది.
ఈ చెన్నూరు గ్రామానికి నేతలు అనుకుంటే తాడిపర్తి గ్రామం నుండి చిట్యాల ప్ర ధాన రోడ్డు గోపాలపేట వైపు నుండి మూ డు రహదారులు ఉన్నాయి. ఉదయం సా యంత్రం వేళలో బస్సు సౌకర్యాలు ఏర్పా టు చేస్తే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుం ది. ముఖ్యంగా గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ మారుమూల పల్లెలు అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ఎన్నో కోట్లలక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించి ప్రతి పల్లెకు బీటీ రోడ్డు సౌకర్యాల ను కల్పించారు చాలా బాగుంది. కానీ గోపాలపేట మండలం చెన్నూరు గ్రామానికి ఓ బ స్సును ఏర్పాటు చేసి ఉంటే మరింత బాగుం డు.
గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ చెన్నూరు గ్రామానికి బ స్సు వెళ్లే విధంగా గోపాలపేట ఊరు చివరలో బ్రిడ్జ్ నుండి పూర్వం రాజులు ఏర్పా టుచేసిన కోట గోడ పక్కనుండి నేరుగా రో డ్డు సౌకర్యాన్ని చెన్నూరు రోడ్డుకు నేరుగా వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తామని సర్వేలు సై తం చేయించారు. దిన దినాన ఆ రోడ్డు సౌకర్యాల ఊసే మరిచారు. ముఖ్యంగా చెన్నూ రు గ్రామం నుండి గోపాలపేట మండలానికి రావాలంటే ప్రజలు అస్తవ్యస్తాలు పడుతూ నడుచుకుంటూ మండలానికి చేరుకుంటున్నారు.
అంతేకాదండోయ్ ఈ మండలానికి రావాలంటే సద్ది కట్టుకొని రావాల్సిందే. విద్యార్థులు ఎన్నో ఏళ్ల నుంచి గోపాలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించాలి. విద్యార్థులు నడుచుకుంటూ వస్తూ ఇక్కడ చదువుకుంటున్నారు. కొంతమంది మహిళా విద్యార్థులు నడుచుకుంటూ వెళితే బాట వెంట ఆకతాయిలు ఏమన్నా అంటారో ఏమోనని తల్లిదండ్రులు చదివే మానిపించి ఇంట్లో పెడుతున్నారు.
మండలానికి గాని వనపర్తి జిల్లాకు గాని అవసరం పై వెళ్లలేక ప్రజలు గ్రామ నడిబొడ్డున వెలిసిన చింత చెట్టు కింద చింత చేయడమే తప్ప మరి ఏదీ లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఏ ఒక్క ప్రభుత్వానికి ఎందుకు మా ఊరు గుర్తుకు రాదా అంటూ వృద్ధులు ఆరోపిస్తున్నారు. కొల్లాపూర్, సింగాయపల్లి గ్రామాలకు ముఖ్యమంత్రి వస్తున్నాడు అం టే ఆ గ్రామానికి రహదారి లేకున్నా నక్లెస్ రోడ్డులా మారుస్తారు.
ప్రజలతో ఎన్నుకున్న ముఖ్యమంత్రి కే సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకెందుకు కల్పియారంటూ దూషిస్తున్నారు. ప్రజలు రోగాల కు గురవుతే తక్షణమే గోపాలపేట వనపర్తి ఆసుపత్రిలకు వెళ్లాలంటే బ స్సు సౌకర్యం లేక ఆశా వర్కర్లు ఇచ్చే మాత్రలతోనే సర్దుకుంటున్నారు. ప్రతి ఏటా చెన్నూ రు గ్రామానికి ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి మీ సమస్యలు ఏంటని అడిగిన పాపాన పోలేదు.
ఓట్ల కోసమే వారి ప్రయాణం అంటున్న ప్రజలు విమర్శిస్తున్నా రు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అంటారే తప్ప ప్రజలను ఎందు కు పట్టించుకోరని వాపోతున్నారు. ఈ ప్రభుత్వమైనా స్పందించి మూడు రహదారులు న్న ఈ చెన్నూరు గ్రామానికి బస్సు ఏర్పాటు చేయాలని 2500 మంది ప్రజలు నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎన్నోసార్లు నాయకులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆర్టీసీ రవాణా శాఖ అధికారులకు తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రాలు ధ ర్నాలు రాస్తారోకోలు చేసిన ఏ ఒక్క రాజకీ య నేతలు గాని ఆర్టీసీ రవాణా శాఖ అధికారులు పట్టించుకోలేదని చెన్నూరు ప్రజలు ఆవేదన చెందడం బాధాకరం...
ఓ చిన్నోళ్ల చేతిలో వినతి పత్రం : గడ్డం నాగమ్మ, మాజీ సర్పంచ్
నేను పెళ్లి చేసుకొని ఈ గ్రామానికి వచ్చి న నాటి నుండి ఇప్పటికీ ఒక్క బస్సు కాన రాలేదు నేను ఈ గ్రామ సర్పంచ్ గా గెలిచిన తర్వాత మొదటి వినతి పత్రం మా గ్రామాని కి బస్సు సౌకర్యం కల్పించాలని. కానీ మా ప్రభుత్వంలో పాలిస్తున్న ఎమ్మెల్యేలకు ఆర్టీసీ అధికారులకు ఎన్నోమార్లు కాగితాలు ఇచ్చా ము మా గ్రామానికి బస్సు లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చూడలేక అంతే కాకుండా గోపాలపేట మండలా నికి వెళ్లాలంటే ప్రజలు నడుచుకుంటూ వెళుతున్నారని వచ్చినోళ్ళందరికీ చేతిలో బస్సు ఏర్పాటుకు కాగితాలు పెడుతున్నాము తప్ప బస్సు మాత్రం ఎరగను.
రోగం వస్తే చావాల్సిందే: నారాయణ రావు, చెన్నూరు
మా గ్రామానికి ఎన్నో ఏళ్ల నుండి బస్సు సౌకర్యం లేదు ఈ గ్రామానికి బస్సు ఏర్పా టు చేయాలంటే మూడు రహదారులు ఉ న్నాయి కానీ వాటిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రోడ్డు ఏర్పాటు కోసం ఎక్కడైతేసర్వే అదే సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే మేగా రెడ్డి సర్వే చే యించి రోడ్డు ఏర్పాటు చేసి బస్సు సౌకర్యం కల్పించాలి. ప్రజలకు రోగాలు వస్తే ఆసుపత్రికి వెళ్లలేక కొంతమంది పరిస్థితి బాగాలేక ఇక్కడే తను చాలిస్తున్నారు.
ముఖ్యమంత్రి గారూ ఆధార్ కార్డు ప్రయాణం చేయనివ్వరా: గాయత్రి,విద్యార్థిని
తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా ఏ మండలం చూ సినా ఏ గ్రామం చూసిన బస్సు సౌకర్యంతో కిటకిటలాడుతున్నా యి. అన్ని గ్రామాల విద్యార్థులు చదువుకోవడానికి బస్సు ఎక్కి ఆధార్ కార్డు చూ యించి ప్రయాణం చేస్తున్నారు. కానీ ఆ దేవు డు మమ్మల్ని బస్సు ఎక్కించడం లేదు. ము ఖ్యమంత్రి స్పందించి మా గ్రామానికి బస్సు ఏర్పాటు చేస్తే మేము కూడా ఆధార్ కార్డు చూయించి పాఠశాలకు వెళ్లి చదువుకుంటాము
నడుచుకుంటూ రావాలంటే భయంగా ఉంది: గీత విద్యార్థిని,చెన్నూరు
నేను మొదటి తరగతి నుండి 5వ తరగతి వర కు మా గ్రామం లో ఉన్న పాఠశాలలో చదువుకు న్నాను ఆరవ తరగతి నుండి 10 వ రకు గోపాలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకోవాలి ఇప్పటికీ నాలుగేళ్లుగా నడుచుకుంటూ వెళుతూ గోపాలపేట పాఠశాలలో చదువుకుంటున్నాను బాట వెంట నడుచుకుంటూ రావాలంటే భయం భయంగా ఉంటుంది ఎవరైనా ముందుగా వెళ్లారంటే నేను ఒక్కదాన్నే అవుతానని మా అమ్మానాన్న ఈరోజు బడి వద్దు అని ఇంటి వద్ద ఉంచుతున్నారు. ప్రభుత్వం మా గ్రామానికి బస్సు ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుంది.