calender_icon.png 30 January, 2026 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం కప్ స్పోర్ట్స్ మీట్‌లో పరండోలి జట్టు ప్రథమ స్థానం

30-01-2026 08:13:31 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సీఎం కప్ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా కెరామేరి మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో పరండోలి గ్రామానికి చెందిన వాలీబాల్ జట్టు అద్భుత ప్రదర్శనతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. పరండోలి జట్టు విజేతగా నిలవడంతో క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. విజేత జట్టును ఎంపీడీవో, ఎంఈఓ, ఎంపిఓ,స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  క్రీడాకారులు జాదవ్ విష్ణు ,రాథోడ్ ప్రవీణ్, విక్రమ్, అతుల్, ఆడే ఆకాష్, వీజెష్ పాల్గొన్నారు.