calender_icon.png 17 November, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య్‌త్‌శాఖ-పొలంబాటతో నాణ్యమైన సరఫరా

29-07-2024 01:22:24 AM

ముదిగొండ, జూలై 28: విద్యుత్ సమస్యలను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యత్‌శాఖ-పొలంబాట అనే కార్యక్రమాన్ని చేపట్టిందని విద్యుత్‌శాఖ సూపరింటిండెంట్ ఇంజనీర్ సురేందర్ తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా  మధిర నియోజకవర్గం పరిధిలోని ముదిగొండ మండలం లక్ష్మీపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగిన స్తంభాలను సరిచేయడం, విరిగిన, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను మార్చడం, కిందకి వేలాడుతున్న తీగలను సరిచేయడం వంటి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ బాబురావు, ఏడీఈ భీమ్‌సింగ్, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.