17-11-2025 12:19:44 AM
- విద్యార్థులతో ఇవేం పనులు
- చైల్ లేబర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి
ఇల్లంతకుంట, నవంబర్ 16(విజయక్రాంతి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యా యులే విద్యార్థులతో పనులు చేపిస్తున్న దృ శ్యాలు ఇల్లంతకుంట మండలంలో కోకొల్లలుగా కనపడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులతో డైనిం గ్ హాల్ శుభ్రం చేయించడం మండలంలో కలకలం రేపింది.అప్పటివరకు విద్యార్థులు అక్కడే భోజనం చేశారు.
అనంతరం కొంతమంది విద్యార్థులతో ఉపాధ్యాయులు డైనిం గ్ హాల్ ను శుభ్రం చేయించారు. విద్యార్థులు శుభ్రం చేస్తున్నప్పుడు ఓ ఉపాధ్యాయుడు తాపీగా ఫోన్ మాట్లాడుతూ దర్శనం ఇవ్వ డం కొసమెరుపు.క్లాస్ రూముల్లోకి ఫోన్లు తీసుకెళ్ళకూడదు అనే నిబంధన ఉన్న కూ డా మమ్మల్ని ఎవరూ ఏం అంటారులే అనుకుంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. క్లాస్ జరుగుతున్న మధ్యలోనే ఫోన్ రావడం తో తాపీగా వెళ్ళి మాట్లాడుకొని వస్తున్నారు.
గతంలో కూడా ఇలాంటి పనులే
గతంలో కూడా విద్యార్థులతో ఇలాంటి పనులు చాలానే చేయించారు. సార్లు తాపీ గా కారుల్లో వస్తే విద్యార్థులు గేట్ తీయాల్సిందే. ఉపాధ్యాయులకు సంబంధించిన కొన్ని విషయాలు తప్పనిసరిగా చేయాల్సిందే అంటూ హుకుం జారీ చేసినట్టు విద్యార్థులు ఆవేదనతో తమ బాధను వ్యక్తం చేశారు.ముఖ్యంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతోనే ఎక్కువగా పనులు చేపిస్తున్నారని కింది తరగతుల విద్యార్థులు తెలిపా రు.
దీనిపై పాఠశాల ఉపాధ్యాయులను వివరణ కోరగా స్కావెంజర్ డైనింగ్ హాల్ ను శుభ్రం చేసిందని, మోటార్ బంద్ చేయడానికి వెళ్ళినప్పుడు విద్యార్థులు క్లీన్ చేశారని తెలిపారు.క్లాస్ లో ఉండాల్సిన విద్యార్థులు బయట తిరుగుతూ పనులు చేస్తుంటే ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారో మరి, పరిసరాల పరిశుభ్రతలో భాగంగా పని చేయించామని తెలిపిన ఉపాధ్యాయులు కేవలం నలుగురు విద్యార్థులతో పని చేయించడం వెనక ఉన్న మతలబు ఏంటి అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బరువులు ఎత్తుతున్న విద్యార్థులు
విద్యార్థులతో పొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కంప్యూటర్ పరికరాలు, పుస్తకాలు మోపించారు. దీనిపై వివరణ కోరగా వాళ్ళ పుస్తకాలు వాళ్ళతో మోపించడం వల్ల ఇబ్బంది ఏంట ని ఎదురు ప్రశ్నించారు.విద్యార్థులతో ఇటువంటి పనులు చేయించడం ఏంటని విద్యా ర్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి పనులు చేపిస్తున్న పాఠశాలలపై విద్యాహక్కు చట్టం 2009, చైల్ లేబర్ యాక్ట్ 1986 ప్రకారం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడా నికి పంపిస్తే విద్యార్థులను కూలి పని చే పించడం సరైంది కా దు. ప్రభుత్వం విద్యార్థులను పాఠశాల లో కూలీలుగా తయారు చేస్తుంది. చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాల్సిన విద్యార్థులను హమాలీ కూలీగా తయారు చేస్తుండడం బాధగా ఉంది.
అక్కెం నాగరాజు ఏబీవీపీ నాయకుడు
చర్యలు తీసుకుంటాం
విద్యార్థులతో ఎటువంటి పనులు చే యించరాదు. పనులు చేయించిన పాఠశాల ఉపాధ్యాయులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.
శ్రీనివాస్, ఎంఈవో ఇల్లంతకుంట