17-11-2025 12:20:40 AM
ప్రయాణికులకు తొలగిన ఇబ్బంది
మహబూబాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం రైల్వే స్టేషన్లో మూడో రైలు లైన్ ఏర్పా టు నేపథ్యంలో కొత్తగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనుల జాప్యంతో ప్రయాణికు లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం తో పాటు మూడో ప్లాట్ఫా మ్ నిర్మాణం చేపట్టారు. అయితే పనులను వేగవంతంగా నిరహించకపోవడం వల్ల ప్ర యాణికులు రైల్వే ట్రాక్ దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
పలు మార్లు ప్రయాణికులు రైలు ప్రయాణం చేయడానికి వెళ్ళే సమయంలో ఇటు నాలుగో రైల్వే ట్రాక్ వైపు నుంచి రెండో ఫ్లాట్ ఫారం వరకు వెళ్లడానికి నానా యాతన పడాల్సి వచ్చింది. నూతనంగా నిర్మించిన మూడో ప్లాట్ఫామ్ పై గూడ్స్ రైలు నిలిపితే రైలు పట్టాలు దాటడం ప్రాణాంతకంగా మారేది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయని అనేక పర్యాయాలు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి.
అయితే రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి మూడో ఫ్లాట్ ఫారం పై నిలిచి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్క సారిగా రైలు కదిలింది. భితిల్లిన సదరు ప్రయాణికుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి పట్టాలపై పడుకున్నాడు. ఈ విషయా న్ని గమనించిన ప్రయాణికులు వెంటనే గట్టిగా కేకలు వేయడంతో గార్డు స్పందింది లోకో పైలట్ కు సమాచారం ఇచ్చి రైలు నిలిపివేయించడంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ ఘటన తర్వాత రైల్వే ఇంజనీరింగ్ అధికారులు స్పందించి కొత్తగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై కప్పు పనులు పూర్తి చేయకపోయినప్పటికీ ప్రయాణికులు నడక సాగించేందుకు అనుమతించారు. దీని తో ఆదివారం నుంచి కేసముద్రం రైల్వే స్టేషన్ లో రెండో ఫ్లాట్ ఫామ్ నుంచి అమీనాపురం వైపు ప్రయాణికులు రైల్వే ట్రాక్ దాటేందుకు అనుకూలంగా మారింది.
పిట్టకేలకు ప్రయాణికులకు కేసముద్రం రైల్వే స్టేషన్లో ఫోటో ఓవర్ బ్రిడ్జి సమస్య తొలగిపోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మూడో ప్లాట్ ఫామ్ నిర్మాణం ఇంకా నత్త నడకన సాగుతూ ఉండడం పట్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అసంపూర్తి ప్లాట్ ఫామ్ పైనే రైళ్లను అనుమతించడం వల్ల మూడో ప్లాట్ఫారం పై రైలు నిలవడం వల్ల రాయల్ ఎక్కి దిగడానికి ఇబ్బందులు పడుతున్నారు. మూడో ప్లాట్ఫారం నిర్మాణం ఫలిత కట్టిన పూర్తి చేసి, నాలుగో ప్లాట్ఫారం కూడా నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.