calender_icon.png 17 November, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇమ్మడి రవికి బొమ్మచూపిన పోలీసులు

17-11-2025 12:38:32 AM

నిందితుడితోనే వెబ్‌సైట్లను బ్లాక్ చేయించిన పోలీసులు

హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 16 (విజయక్రాంతి) : తెలుగు సినీ పరిశ్రమకు కొరకరాని కొయ్యగా మారిన పైరసీ భూతంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సినిమా లవర్స్‌కు సుపరిచితమైన ఐబొమ్మ, బప్పమ్ వంటి పైరసీ వెబ్‌సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి నెట్టారు.

తం లో దమ్ముంటే నన్ను పట్టుకోండి, నా వెబ్‌సైట్ జోలికొస్తే కోట్ల మంది డేటాను లీక్‌చేస్తా అంటూ పోలీసులకే సవాల్ విసిరిన రవి హైదరాబాద్ రాగానే చాకచక్యంగా పట్టుకున్నారు. అతని హార్డ్‌డిస్క్‌లో వేలసంఖ్యలో సినిమాలు ఉన్నట్టు కనుగొన్నారు. ఈఆర్ ఇన్ఫోటెక్ కంపె ని నడుపుతున్న ఇమ్మడి రవికి హైదరాబాద్ పోలీసులు సినిమా చూపించారు! రవి నడుపుతున్న వెబ్‌సైట్లను అతని చేతనే క్లోజ్ చేయించారు.

ఐబొమ్మ, బప్పమ్ వెబ్‌సైట్ల లాగిన్‌లు, సర్వర్ల వివరాలను తీసుకుని వా టిని మూసివేయించారు. కూకట్‌పల్లిలోని అ తని అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేసి, వందలాది హార్డ్ డిస్కులు, పలు సినిమాల హెడీ ప్రింట్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నా రు. అతని బ్యాంకు ఖాతాలో ఉన్న సుమారు రూ. 3 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. న్యాయస్థానం రవికి 14 రోజుల రిమాండ్ విధిం చడంతో, అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కేసులో మరిన్ని వివరాలు రాబ ట్టేందుకు సోమవారం కస్టడీ పిటిషన్ దాఖ లు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కొ త్త సినిమా థియేటర్‌లో లేదా ఓటీటీలో విడుదల కాగానే, క్షణాల్లో హెడీ ప్రింట్‌ను తమ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తూ సినీ పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్న ఇమ్మడి రవిపై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఏ డాది జూన్ నుంచి అతని కోసం గాలిస్తున్న పోలీసులు, అతను ఫ్రాన్స్‌లో ఉన్నట్లు గుర్తించారు.

రవి హైదరాబాద్ వస్తున్నాడన్న పక్కా సమాచారంతో.. కూకట్‌పల్లిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాన్స్‌లో రవి ౨౦ మందితో ఏకంగా ఒక టీమ్‌నే ఏర్పాటు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అతని వెబ్‌సైట్లపై గతంలో ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, తనపై ఫిర్యాదు చేసినవారిని రవి బెదిరించేవాడని తెలిసింది.

దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ చేసిన పైరసీ కింగ్‌ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సైబర్ క్రైమ్ డీసీపీ కవిత, వారి బృందాన్ని రాష్ర్ట హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్ ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా అభినందించారు. ఒరిజినల్ సినిమా కాపీలను హ్యాక్ చేసి, సినీ పరిశ్రమకు భారీనష్టం కలిగిస్తున్న ప్రధాన నిందితుడుని అరెస్ట్ చేసిన పోలీసులకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.