6 July, 2026 | 3:35 PM

Breaking News

టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •  

ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలి

21-03-2025 01:48 AM

ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఆదిలాబాద్ (విజయ క్రాంతి) : రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. అదేవిధంగా శనగల కొనుగోలులో ఎకరాకు 6.29 క్వింటాల్లే కాకుండా ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారంఎమ్మెల్యే  శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ముందుగా కాంటలకు ప్రత్యేక పూజలు చేసి, పంటను మార్కెట్ యార్డుకు తీసుకు వచ్చిన తొలి రైతుని శాలువాతో సత్కరించి కొనుగోలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులకు నమ్మి మోసపోకుండా రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రలోనే అమ్మలని సూచించారు.

మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సంధ్యారాణి, మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మాజీ మర్కెట్ కమిటి చైర్మన్ రుక్మాన్ సింగ్, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.