23-04-2025 01:26:42 AM
కోదాడ ఏప్రిల్ 22 ః మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో కోదాడ పట్టణానికి చెందిన రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు రాష్ర్టస్థాయిలో తమ సత్తా చాటారు. కళాశాలకు చెందిన వంగవేటి అక్షయ % .శ్రీం% (2552107410) ఎంపీసీ ప్రథమ సంవత్సరం నందు 470 మార్కులకు గాను 468 మార్కులతో రాష్ర్టంలో మొదటి ర్యాంకు సాధించింది. చిత్తార చరణ్ శ్రీ తేజ ,జీడిమెట్ల లేఖనా రెడ్డి, ముక్క చరణ్ సాయి గౌడ్ లు 467 మార్కులు సాధించి రాష్ర్టంలో ద్వితీయ స్థానంలో నిలిచారు.
రెడ్డిమల్ల భార్గవి 466, మారెడ్డి మణిదీప రెడ్డి 465, మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం బైపిసి విభాగం నందు ఉప్పెల్లి అలేఖ్య 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించారు. షేక్ సుహానా 432 మార్కులు రాష్ర్టస్థాయిలో సాధించారు. రేస్ ఐఐటి మెడికల్ కళాశాల చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి రాష్ర్ట ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ప్రిన్సిపాల్ ,అధ్యాపక బృందం పాల్గొన్నారు.