calender_icon.png 6 May, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

23-04-2025 01:28:24 AM

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు

పాపన్నపేట, ఏప్రిల్ 22 : రైతులు దళారులు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు చేపట్టాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు సూచించారు. పాపన్నపేట మండలంలో కొత్తపల్లి, ఎన్కకపల్లి, లక్ష్మీనగర్, పొడ్చన్పల్లి, సానాయిపల్లిలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ధాన్యం తేమ శాతాన్ని పర్యవేక్షించి, సంబంధిత ధాన్యం కొనుగోళ్ల రిజిస్టర్ లను తనిఖీ చేసి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రైతులు కళ్లాల్లోని ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఈదురు గాలికి ఎగిరిపోకుండా టార్పాలిన్లను పకడ్బందీగా ధాన్యం కుప్పలపై కప్పాలని సూచించారు. అదే విధంగా ఎక్కువ రోజుల వరకు ధాన్యాన్ని కేంద్రాల్లోనే పెట్టుకోకుండా నిర్దిష్ట తేమ శాతం రాగానే కొనుగోళ్లు పూర్తిచేసి, ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు.