అర్మూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా రఫీ గోహర్
అర్మూర్, జులై 23 (విజయ క్రాంతి) : అర్మూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా మహమ్మద్ రఫీ గోహర్ ఎన్కయ్యారు. గురువారం అర్మూర్ పట్టణ శివారులోని రెడ్డి సంఘంలో నూతన కార్యవర్గ ప్రమాణ శ్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బసవేశ్వర రావు, ఫస్ట్ వి.డి.జి.గా ఎస్ ఎస్ శ్యాం కుమార్, సెకండ్ వి.డి.జి.గా నరసింహ రాజు, పద్మావతి, లయన్స్ డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్లు వీరేశం, పెంటయ్యలు హాజరై నూతన కార్యవర్గాన్ని ప్రమాణ శ్వీకారం చేయించారు.
అధ్యక్షునిగా రఫీ గోహర్, ప్రధాన కార్యదర్శిగా అంబాల తిరుపతి, కోశాధికారిగా సుధీర్ బాబుతో పాటు వివిధ హోదాల్లో ఉన్న సభ్యులతో ప్రమాణ శ్వీకారం చేయించారు. అతిథులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లయన్ రఫీ గౌహర్ మాట్లాడుతూ తనకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యులతో కలిసి సేవా కార్యక్రమాలలో పాల్గొని మా వంతు సహకారం అందిస్తామని అన్నారు. ప్రమాణ శ్వీకారనికి హాజరైన అతిథులకు, వివిధ ప్రాంతాల లయన్స్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్మూర్, హైదరాబాద్, నిజామాబాద్, బాల్కొండ, నిర్మల్, కమ్మర్పల్లి లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.






