calender_icon.png 5 July, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చౌకధరలకు రాగులు

25-04-2025 12:00:00 AM

చౌక ధరల దుకాణాల ద్వారా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిలో రాగులను రెండు రూపాయలకే పంపిణీ చేయటం హర్షణీయం. చిరుధాన్యాలలో రాగులు ఎంతో ముఖ్యమైనవి. మన ఆరోగ్యానికి కూడా ఉపయోగకరం. రాగులలో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ మాత్రలను స్వీకరించటం కంటే రాగులను వివిధ రకాలుగా ఆహారంలో వాడుకోవటం శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలోనూ ఇలాంటి పథకాన్ని ప్రవేశపెడితే ప్రజలకు ప్రభుత్వం ఎంతో మేలు చేసినట్టు అవుతుంది.  

 కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్