27-07-2025 01:16:59 AM
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బడుగు, బలహీన వర్గాల అభివృద్ది, అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు అన్నారు. బీసీలు, పేదల కోసం పరితపించిన జ్యోతిబా ఫూలేను తాము చూడలేదన్నా రు. కానీ ఇప్పుడు ఫూలే బాటలో నడుస్తున్న రాహుల్‌గాంధీ.. అభినవ ఫూలే అని వీహెచ్ కొనియాడారు.
శనివారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ నిర్ణయం మేరకు తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి కులగణన చేయడంతో పాటు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీ యమన్నారు. 21వ శాతబ్దానికి రాహుల్‌గాం ధీ మహాత్మఫూలేలాంటి వాడన్నారు. రాహుల్‌గాంధీ ఆలోచనలను అమలు చేయాల న్నదే తమ ప్రభుత్వ నిర్ణయమన్నారు.
ఎవరి జనాభా ఎంతో.. వారికి అంతా వాటా ఇవ్వాలని భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకుని, బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఆయన గుర్తు చేశారు. చదువుకుం టేనే భవిష్యత్ ఉంటుందని జ్యోతిబాఫూలే, సావిత్రిబాయి ఫూలే చెప్పారని పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లను ఐక్యంగా ఉండి సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ.. పార్లమెంట్‌కు వచ్చేసరికి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఆటంకాలు కల్పించినా బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో అమలవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.