10-04-2025 01:53:47 PM
హైదరాబాద్: నిన్న ఏఐసీసీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పాలనను రాహుల్ గాంధీ ప్రశంసించారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Congress MP Chamala Kiran Kumar Reddy) నేడు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ పాలనను రాహుల్ గాంధీ కూడా మెచ్చుకున్నారని చెప్పారు. సమాచారలోపం వ్లలే ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ దీక్షకు రాహుల్ గాంధీ రాలేదని వివరించారు.
తెలంగాణలో మీరు కార్పొరేట్ కంపెనీల జాబితాను పరిశీలిస్తే.. దళితులు, వెనుకబడిన వారు, ఆదివాసీలకు చెందిన ఒక్క వ్యక్తినీ కూడా ఆ జాబితాలో ఉండడం చూడలేరని రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. అదే సమయంలో, గిగ్ వర్కర్ల జాబితాను చూసినట్లయితే, అందులో ఎక్కువ మంది దళితులు, వెనుకబడిన వారు, ఆదివాసీ వర్గాలవారే ఉంటారని చెప్పారు. అందుకే, తెలంగాణలో జాతి ఆధారిత జనగణన రిపోర్టు వచ్చిన తరువాత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్‌ను 42శాతం వరకు పెంచారని కొనియాడారు. నరేంద్ర మోదీ 24 గంటలూ దళితులు, వెనుకబడిన వారు, వనవాసులు అని మాట్లాడతారు. కానీ దేశంలో 90శాతం ఉన్న ప్రజల ప్రాతినిధ్యం గురించి మాట వచ్చినప్పుడు మాత్రం మౌనంగా ఉంటారని ఆరోపించారు. కానీ, తెలంగాణ ఎలా దేశానికి మార్గం చూపించిందో, అలాగే మేము దేశమంతా జాతి ఆధారిత జనగణన నిర్వహిస్తాం, రిజర్వేషన్లపై 50శాతం పరిమితి అనే గోడను చేధిస్తామని ఏఐసీసీ (All India Congress Committee) ప్లీనరీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.