calender_icon.png 26 June, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా ప్రదానం చేస్తున్న రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం

24-06-2025 12:00:00 AM

చర్ల,జూన్ 23 ( విజయ క్రాంతి): చర్ల లో గల రాహుల్ విజ్ఞాన విద్యాలయం లో సోమవారం సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు. తాను చదువుల్లో గొప్ప చదువులు చదివి ఉన్నత ఉద్యోగంలో ఉండి దేవుడు తర్వాత దేవుడిగా ప్రశంసపొందే డాక్టర్ వృత్తిలో ఉన్న డాక్టర్ డి ఎన్ కు మార్ చదువుకున్న చదువు మరికొందరిని చదివించాలనే ఆశయంతో పుట్టిన ఊరులోనే కుమారుడు రాహుల్ జ్ఞాపకార్థం రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం ఏర్పాటు చేశారు.

విద్యార్థులకు చక్కని భవితవ్యాన్ని అందించే ఆలోచనతో పుట్టిన ఊరు పై మక్కువతో మంచి మనస్సుతో, గ్రామీణ వాసులకు ఉన్నతమైన - నాణ్యమైన విద్యను అందించాలనే అభిలాషతో సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం 2000 వ సంవత్సరంలో జూన్ 22 న తుమ్మల నాగేశ్వరరావు చేతుల ప్రారం భించ బడిన రాహుల్ విజ్ఞాన విద్యాలయం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

డాక్టర్ డి ఎన్ కుమార్ చే ఏర్పాటు చేసిన రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం ఇరవై ఆరవ సంవత్సరంలో అడుగుపెడు తోంది.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు సైతం హాజరయ్యారు .ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు రాము,శ్రీధర్, సునీత, రమా దేవి తదితరులు పాల్గొన్నారు.