ఐస్ క్రీం తయారీ కేంద్రంపై దాడులు
సికింద్రాబాద్, మార్చ్26 (విజయక్రాంతి): హైదరాబాద్ సిటీ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ (ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ బృందా లు) హెచ్-ఫాస్ట్ టీమ్, జిహెచ్‌ఎంసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (సర్కిల్ నం. 40) బి. సాహితీ తో కలిసి సంయుక్తంగా ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీ నగర్లో ఉన్న ’బ్లూ బెల్స్ ఐస్ క్రీం’ తయారీ కేంద్రంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో ఎటువంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణం లో గడువు ముగిసిన ముడి పదార్థాలతో ఐస్ క్రీంలు తయారు చేస్తున్న పట్టాల అశోక్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వ అనుమతులు లేకుం డా పెద్ద ఎత్తున కల్తీ ఐస్ క్రీం ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. నాణ్యమైన ఐస్ క్రీంలని నమ్మబలుకుతూ హోల్ సేల్, రిటైల్ కస్టమర్లకు సరఫరా చేస్తూ అక్రమ లాభాలు గడిస్తున్నాడు. తయారీలో గడువు ముగిసిన రంగులు, ఫ్లేవర్లను ఉపయోగిస్తూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ట్లు పోలీసులు గుర్తించారు.
ఈ దాడుల్లోతయారీ కేంద్రంలో ముడి పదార్థాల నిల్వ ప్రాంతం అత్యంత అపరిశుభ్రంగా,వినియోగానికి పనికిరాని వస్తువులను మరియు పోలీసులు మొత్తం రూ. 1,75,000/- విలువైన 3,759 వివిధ రకాల ఐస్ క్రీం ఉత్ప త్తులను (సుమారు 1,252 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. గడువు ముగిసిన పైనాపిల్, మాంగో, సీతాఫల్ ఫ్లేవర్ బాటిళ్లను కూడా పోలీసులు సీజ్ చేశారు.ఈ ఆపరేషన్లో ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి. రాఘవేందర్, సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జె. రాజశేఖర్, ఎస్.ఐ. కృష్ణ, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, హెచ్-ఫాస్ట్ టీమ్ పాల్గొన్నారు.




